- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుంటూరు మాయగాళ్లతో నాకే సంబంధం లేదు : ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
దిశ, గుంటూరు : గుంటూరు జిల్లా పలకలూరు రోడ్డుకు చెందిన సూరబత్తుని కృష్ణ చైతన్యకు చెందిన విష్ణు ఓవర్సీస్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆ సంస్థ ప్రారంభోత్సవానికి తన అనుచరుల ద్వారా నిర్వాహకులు ఆహ్వానిస్తే వెళ్ళానే తప్ప ఆ సంస్థ కార్యకలాపాలు, నిర్వాహకులతో తనకేమీ సంబంధం లేదని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. దిశ పత్రిక వచ్చిక కథనానికి స్పందించిన ఆయన పైవిధంగా స్పందించారు.
కాగా, గుంటూరు కేంద్రంగా విష్ణు ఓవర్సీస్ సంస్థ పేరుతో ని కృష్ణ చైతన్య తెలుగు రాష్ట్రాల్లోని 57 మందికి ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి కోట్లలో కుచ్చుటోపీ పెట్టాడు. బ్రిటన్‌లో జాబ్ వీసాలు ఇప్పిస్తామని రూ.14 కోట్లను దండుకున్నారు. వీరిపై మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే అప్పట్లో ఈ సంస్థను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఓపెన్ చేయడంతో ఆయనపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. ఆ సంస్థతోగానీ నిర్వాహకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు.