- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనెప్పుడూ సింహాన్నే..జగన్ నాతో పోటీపడగలడా?: N. Chandrababu Naidu
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్ సైకో ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నేను ఎప్పుడూ సింహాన్నే. సింహంగానే బతుకుతా అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘వైఎస్ జగన్ నా వయస్సుని తప్పుపట్టాడు. ఈ ముఖ్యమంత్రి నాతో పోటీపడి పనిచేయగలడా? రాత్రి మొత్రం పనిచేసినా తెల్లారి మరలా ఉత్సాహంగా పనిచేస్తాను. 20ఏళ్ల తర్వాత జరగబోయేది ముందే ఆలోచించి, దానికి అనుగుణంగా ప్రణాళికలు వేస్తాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఎకరాకు నీరు, ప్రతి తమ్ముడికి ఉద్యోగం, ప్రతిమహిళ కళ్లల్లో సంతోషం. ఇవన్నీ చేస్తాను. తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ -1 గా ఉండటానికి పనిచేస్తాను. తెలుగువాడు తలసరి ఆదాయార్జనలో ముందున్నాడు. ఫ్రస్టేషన్ తో శాపనార్థాలు పెడితే భయపడను. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2 వేల కోట్లు ఖర్చుపెట్టిన మీరు రాయలసీమ ద్రోహం..కాదా?’ అని నిలదీశారు. ‘నీరే మన భవిష్యత్ అని తెలుసుకోండి. విద్యుత్ వస్తుంది.. పరిశ్రమలు వస్తాయి.. పంటలు పండుతాయి. 2019లో ఈ సైకో రాకపోతే, ఏపీ తెలంగాణను మించిపోయేది. అక్కడి వారు ఎవరూ సైకోల్లా విధ్వంసంచేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే, మా పిల్లలు గర్వపడేలా పరిశ్రమలు తీసుకొస్తాను. పోలవరం పూర్తిచేస్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.