మ‌చిలీప‌ట్నంలో హైడ్రా తరహా ఆపరేషన్.. 180 అక్రమ నిర్మాణాలు కూల్చివేత‌

by srinivas |
మ‌చిలీప‌ట్నంలో హైడ్రా తరహా ఆపరేషన్.. 180 అక్రమ నిర్మాణాలు కూల్చివేత‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేని కట్టడాలను కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలో వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి బంధువులకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. మచిలీపట్నం మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు పోరంబోకు భూమిలో గత ప్రభుత్వ హయాంలో 180 అక్రమ గృహాల నిర్మాణం జరిగాయి. మడుగు పోరంబోకు స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించినా గత పాలకులు అవేవీ పట్టించుకోలేదు. మడుగు పోరంబోకు స్థలాలు పేదలకు మంజూరు చేయడంతో పాటు వారితో షెడ్లు వేయించారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మచిలీపట్నం మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణలను నేలమట్టం చేశారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు, షెడ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed