- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భార్య, స్నేహితుడు వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో నివాసం ఉంటున్న హరిప్రసాద్ తన భార్య, ప్రాణ స్నేహితుడు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియోలో వివరించి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హరిప్రసాద్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి భువనేశ్వరి అనే మరో వివాహితను రెండో పెళ్ళి చేసుకున్నారు. కానీ ఆమె హరిప్రసాద్ స్నేహితుడు పెంకి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అది తట్టుకోలేక హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు తన స్నేహితుడు, భార్య చేసిన మోసాన్ని వీడియో ద్వారా వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ వీడియాను మొదటి భార్యకు పంపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొదటి భార్యకు, తనకు పుట్టిన బిడ్డను కాపాడాలని, తనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని హరిప్రసాద్ వీడియో ద్వారా పోలీసులను కోరారు. తన కుమార్తెను, ఆస్తులను తన సోదరికి అప్పగించాలని కోరారు. తన మాజీ భర్త హరి ప్రసాద్ ఆత్మహత్యకు ప్రాణస్నేహితుడు పెంకి రాజేషేతో రెండవ భార్య భువనేశ్వరి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణమని మొదటి భార్య వరలక్ష్మి ద్వారకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసింది భువనేశ్వరి పెంకి రాజేష్‌లే. హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు వీడియో ద్వారా తన మరణం వాంగ్మూలం పంపారు. హరిప్రసాద్‌కు జరిగిన అన్యాయానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి’ అని ఆమె కోరారు. హరి ప్రసాద్ పంపిన వీడియోను పోలీసులకు అందజేశారు.