తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-27 05:16:19.0  )
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ నెలకొంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు(Devotees) వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. ఇదిలా ఉంటే నిన్న(గురువారం) శ్రీవారిని 61,328 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 22,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Income) రూ.3.84కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed