- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వాస్తవ మూలధన వ్యయం ఎంత: బీజేపీ నేత
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఆర్థికమంత్రిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇబ్బందులున్న బడ్జెట్ ప్రకారమే మీరు ఆర్థిక నిర్వహణ, వ్యయం చేస్తున్నట్లు బుగ్గన చెబుతున్నది వాస్తవ విరుద్ధమని ట్వీట్ చేశారు. కాగ్ వెబ్‌సైట్‌లో ఉన్న ఆర్థిక పత్రాలు పరిశీలిస్తే, రాష్ట్ర వాస్తవ ఆర్థిక నిర్వహణ లెక్కల బొక్కలు బహిర్గతం అవుతాయన్నారు. డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ వాస్తవ మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక లోటు ఎంత, బడ్జెట్ అంచనా దరిదాపుల్లో ఉన్నాయా నిలదీశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఇబ్బందులు ఉన్నాయంటే ఎవరైనా అంగీకరిస్తారు కానీ, కోవిడ్ ముందు 2019-20, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 సంవత్సరాల విషయంలో అబద్దాలతో ఎలా మభ్యపెడుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల ఆర్థిక పత్రాలు చూస్తే, మీ ఆర్థిక నిర్వహణ దౌర్భాగ్య స్థితిలో, ఉందా, లేదా అంటూ మంత్రిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చేయాల్సిన అప్పులు రూ. 37,029 కోట్లు అంచనా అయితే, మొదటి 9నెలల్లోనే డిసెంబర్ నెలకు రూ. 58,111 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే, మీరు తయారు చేసిన బడ్జెట్ ప్రకారమే పాలన సాగుతుందా అని లంకా దినకర్ నిలదీశారు.