- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏటి అగ్రహారం రాత్రికి రాత్రే ఫాతిమాపురంగా ఎలా మారింది?
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో హిందువులను అవమానించి ఇతర వర్గాలను సంతృప్తి పరచడం తరచూ జరగుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూ సమాజం ఏది ఉంచుకోదు.. తిరిగిచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి అని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇతర మతస్తులకు ప్రజాధనంతో ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ నిధులు మంజూరు చేసి, కావాల్సినంత స్వేచ్చ ఇస్తారు. ఇప్పుడు కొందరు ప్రభుత్వ అండతో కాలనీలకు కాలనీలననే మతం దురహంకారంతో పేర్లు మార్చేస్తున్నారు అని ఆరోపించారు.
రాత్రికి రాత్రే గుంటూరులో ఏటి అగ్రహారం ఫాతిమాపురంగా ఎలా మారింది ? అని నిలదీశారు. పాకిస్థాన్ జాతిపిత పేరు మనకెందుకంటే కేసులు పెడతారు ! జిన్నా టవర్ పేరు మార్చంటే జాతీయ జెండా రంగులేసి రాజకీయం చేస్తారు అంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏటి అగ్రహారం పేరును అలాగే ఉంచి.. జిన్నా టవర్ పేరును తక్షణం మార్చాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ సమాజం మొత్తం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.