NARA LOKESH:స్టేట్ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం.. నారా లోకేష్‌కు కీలక పదవి!

by Anjali |   ( Updated:2024-06-09 04:46:01.0  )
NARA LOKESH:స్టేట్ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం.. నారా లోకేష్‌కు కీలక పదవి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. కాగా ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందని, ఏయే శాఖలు ఎవరికి ఇస్తారనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కి హోం శాఖ ఇవ్వాలన్న డిమాండ్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తల నుంచి వస్తోందని, ఆయన కూడా హోం మంత్రిత్వ శాఖ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story