AP News:‘ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర’..హోం మంత్రి ఆగ్రహం

by Jakkula Mamatha |   ( Updated:2024-07-25 10:29:33.0  )
AP News:‘ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర’..హోం మంత్రి ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ఏపీలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నయాని హోం మంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో చెప్పిన జగన్ మృతుల పేర్లను మాత్రం చెప్పలేకపోయారు అని తెలిపారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా? అని ఆమె అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలపై వివరాలిచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.



AP News:రైతులకు గుడ్ న్యూస్..మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

Advertisement

Next Story