అచ్యుతాపురం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి

by M.Rajitha |
అచ్యుతాపురం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అచ్యుతాపురం ప్రమాద బాధితులకు హోంమంత్రి అనిత చెక్కులు పంపించారు. అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. కాగా మృతుల కుటుంబాలకు ఒక్కరికీ రూ.కోటి చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, దాని ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేశారు.

Advertisement

Next Story