బాలిక అదృశ్యం పై హోంమంత్రి ఆరా.. ఎస్పీకి కీలక ఆదేశాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-07 09:42:46.0  )
బాలిక అదృశ్యం పై హోంమంత్రి ఆరా.. ఎస్పీకి కీలక ఆదేశాలు
X

దిశ ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన నూకరత్నం కుమార్తె కళాశాలలో చదువుతూ గత నెల 22న అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. లేఖలో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయం పై హోంమంత్రి వంగలపూడి అనిత కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో ఫోన్లో మాట్లాడారు. ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఆమె "ఎక్స్" వేదికగా స్పందించారు. అదృశ్యమైన ఇంటర్ చదివే బాలిక గురించి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో ఫోన్లో మాట్లాడానని.. సత్వరమే ప్రత్యేక బృందాలతో గాలించి అమ్మాయి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించానని తెలిపారు.


Read More..

Minister Lokesh:సీఎం చంద్రబాబు వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story