Home Minister Anitha: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కారణం వైసీపీ పాపాలే : హోంమంత్రి అనిత సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Home Minister Anitha: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కారణం వైసీపీ పాపాలే : హోంమంత్రి అనిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కారణం వైసీపీ (YCP) చేసిన పాపాలేనని హోంమంత్రి అనిత (Home Minister Anitha) ఆరోపించారు. ఇవాళ పోలీసు శిక్షణా కేంద్రలో నిర్వహించిన డీఎస్పీ (DSP)ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆమె మండిపడ్డారు. పోలీసు శాఖలో బయోమెట్రిక్(Biometric) రీఛార్జ్ కోసం ఒక్క రూపాయి ఖర్చు చేసిన పాపాన పోలేదని ఆరోపించారు.

గత ప్రభుత్వంలో జరిగిన ఆరాచకాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. అనవసరంగా రాష్ట్రంలో సైకో బ్యాచ్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలకు భయపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు అలా అరాచకాలు చేస్తుంటే.. జగన్ (Jagan) మీడియా ముందుకు వచ్చి సూక్తులు చెప్పడం హ్యాస్యాస్పందంగా ఉందన్నారు. ఆయన ఇంటి భద్రత ఏకంగా రూ.12 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు వైసీపీ (YCP) దుష్ట పాలనే కారణమని హోమంత్రి అనిత ధ్వజమెత్తారు.

Advertisement

Next Story