- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home Minister Anitha: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: ఫెంగల్ తుపాన్ (Fengal Typhoon) ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) సూచించారు. ఇవాళ ఆమె అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరుస వర్షాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి తిరుమల (Tirumala)కు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండలన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు, ఉద్యోగుల రాకపోకలపై నిత్యం ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం (Krishnapatnam) వద్ద సముద్రం ముంపుకు గురైన నేపథ్యంలో అక్కడున్న లంక గ్రామాల ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపాన్ కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలను సర్కార్ ఆదుకుంటుందని హోంమంత్రి అనిత (Home Minister Anitha) భరోసానిచ్చారు