- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: రాజమండ్రి జైలులో ఎమోషనల్ అయిన హోంమంత్రి అనిత
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో స్నేహా బ్లాక్‌ను చూశారు. దీంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. ఏ తప్పు చేయని తమ నాయకుడు చంద్రబాబును 53 రోజులు ఈ జైల్లోనే పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఇదే జైలుకు తాము వసతులు ఎలా ఉన్నాయో చూసేందుకు వచ్చామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆగస్టు 15కు క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉండదని, గాంధీ జయంతి (అక్టోబర్ 2న) మాత్రమే ఉంటుందని తెలిపారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉందని, దాని వల్ల ఖైదీల విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
కాగా స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు. దాదాపు 53 రోజుల పాటు తన జీవితంలో తొలిసారిగా చంద్రబాబు జైలు జీవితం గడిపారు. అనంతరం అనారోగ్య కారణాలతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సందర్శన నేపథ్యంలో హోంమంత్రి అనిత నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.