చంద్రబాబు బెయిల్ ఆంక్షలపై నేడు హైకోర్టు తీర్పు

by Javid Pasha |   ( Updated:2023-11-03 06:19:04.0  )
చంద్రబాబు బెయిల్ ఆంక్షలపై నేడు హైకోర్టు తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్ ముందు సరెండర్ కావాలని ఆదేశించింది. సరెండర్ అయ్యే సమయంలో మెడికల్ రిపోర్టులు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే చంద్రబాబు బెయిల్‌ షరతులపై మరిన్ని ఆంక్షలు విధించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ సభల్లో పాల్గొనకుండా, మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టును సీఐడీ కోరింది. ర్యాలీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. నేడు తీర్పును హైకోర్టు ప్రకటించనుంది.

Advertisement

Next Story

Most Viewed