Breaking news: అంగన్వాడీల సమ్మె హై కోర్టు అత్యవసర విచారణ..

by Indraja |
Breaking news: అంగన్వాడీల సమ్మె హై కోర్టు అత్యవసర విచారణ..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల, కార్మికుల సమ్మెలతో అట్టుడికిపోతోంది. దాదాపు 20 రోజుల పైగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణీలకు పసిపిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని న్యాయవాది K.ఉషారాణి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరాతీసింది. ఈ తరుణంలో A.G శ్రీరామ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం సమ్మెను విరమింపజేసేలా చర్యలు తీసుకుంటోందని అని తెలిపిన ఆయన.. త్వరలోనే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. అందుకు కాస్త గడువు కావాలని హై కోర్టును కోరారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం విచారణను ఈనెల 22కి వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ R.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

గత 20 రోజుల పైగా వివిధ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని.. దీంతో పౌష్టికాహారం వృథా అవుతోందని, గర్భిణులు, పిల్లలు పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్నారని న్యాయవాది K.ఉషారాణి వాదన. ఇక షోకాజ్‌ నోటీసులు ఇస్తుండటంతో అంగన్ వాడీలు ఉగ్రరూపం దాల్చారు. దీనితో నిన్నటి వరకు శిబిరాలకే పరిమితమైన అంగన్వాడీల ఆందోళన రోడ్డెక్కింది. ఈ నేపధ్యంలో ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్లు.. పోలీసు స్టేషన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అంగన్ వాడీలకు మద్దతుగా పారిశుధ్య కార్మిక సంఘాలు జైల్‌భరో ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed