- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టు కాస్త ఊరట కలిగించింది. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబుకు గదిలో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లో చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, జైల్లో చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఎండల కారణంగా డీహైడ్రేషన్‌కు గురవ్వడంతో పాటు స్కీన్ ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు తరుఫు లాయర్లు ఇవాళ ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఎండల వేడీ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారని.. ఆయన గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. జైల్లో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.