Ap Floods: ఏపీలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం .. లెక్కలు చూస్తే షాకే..!

by srinivas |   ( Updated:2024-09-05 16:21:33.0  )
Ap Floods: ఏపీలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం .. లెక్కలు చూస్తే షాకే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వర్షాలు, వరదలు (Rains & Floods) బీభత్సం సృష్టించాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది మృతి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందారని స్పష్టం చేశారు. ఇక వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. 60 వేల కోళ్లు, 275 పశువులు మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. వరదలతో దెబ్బతిన్న 22 సబ్‌స్టేషన్లు, 3,973 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వరదలతో 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని, పునరావాస కేంద్రాల్లో 45,369 మంది వరద బాధితులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed