Heavy Rains:ఏపీకి భారీ వర్ష సూచన..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-18 09:42:58.0  )
Heavy Rains:ఏపీకి భారీ వర్ష సూచన..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ!
X

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఏపీని వర్షాలు ముంచెత్తాయి. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత కొద్ది రోజుల నుంచి ఏపీలో పొడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఉత్తర కర్ణాటకను ఆనుకొని తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉండడంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తాజాగా ఆది వారం(నేడు), సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

సోమవారం..అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఏలూరు, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, కర్నూలు, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం..ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం, నంద్యాల, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed