హై అలర్ట్.. 4 రోజులు భారీ వర్షాలు

by karthikeya |
హై అలర్ట్.. 4 రోజులు భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 4 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది రేపటికి నైరుతి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. తీరప్రాంతమైన కోస్తాలో ఈ రోజే పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, రేపటి నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కూరుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే భారీ వర్ష సూచన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్‌లైన్ల ఏర్పాటు చేస్తోంది. అధికారులతో హోం మంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గండ్లు పడేకాల్వలు, ఏటి గట్లను గుర్తించాలని ఆదేశించాలని, ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Next Story