పిఠాపురంలో భారీ వరదలు.. నీటమునిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొలాలు

by Mahesh |   ( Updated:2024-09-10 13:57:37.0  )
పిఠాపురంలో భారీ వరదలు.. నీటమునిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొలాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో వరుసగా ఏర్పడిని వాయుగుండాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ(Kakinada) జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లాయి. దీంతో. ఈ క్రమంలో అటునుంచి ప్రవహిస్తున్న ఓ వాగుకు భారీ గండి పడటంతో నీరు మొత్తం రోడ్లపైకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రధాన రోడ్లు మొత్తం జలమయం గా మారాయి. అలాగే పంట పొలాలు, చెలకలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వరదల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొలాలు కూడా మునిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏలేరు ప్రాజెక్టుకు(Project) రికార్డు స్థాయిలో నీరు చేరడంతో వేలాది క్యూసెక్కుల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. ప్రవాహ వేగానికి ఏలేరు సమీపంలో బ్రిడ్జి సైతం కుంగిపోయింది. రాజుపాలెం వద్ద భారీ కెనాల్ కు గండి పడింది. దీంతో పంట పొలాలతో పాటు ప్రధాన రహదారిపై ఆ నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో 8 మండలాలకు ముప్పు పొంచి ఉంది. మునిగిన ఇళ్లు, 25 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోగా.., పదికి పైగా కాలువలకు గండ్లు పడ్డాయి. అలాగే పలు ప్రాంతాల్లో వంతెనలు ధ్వంసం అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed