- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: పూర్తిగా నిండిపోయిన సుంకేసుల.. 20 గేట్లు ఎత్తివేత
దిశ, వెబ్ డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. గంట గంటలకూ వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కర్ణాటకలో కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో జలాశయాలన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం మినహా అన్ని ప్రాజెక్టులు సైతం వరద ప్రవాహంతో పూర్తిగా నిండికుండల్లా మారిపోయాయి. కర్ణాటకలోని పసుపేట జలాశయం 28 గేట్లు ఎత్తి తుంగభద్ర నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ వరద ప్రవాహంతో కర్నూలు జిల్లా రాజోలి శివారులో ఉన్న సుంకేసుల కూడా నిండిపోయింది. 2 వేల 300 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ నీరంతా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. 73 వేల 680 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి వరద నీటితో నిండిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864 అడుగులమేర వరద నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 118.5 టీఎంసీల నీరు ఉంది. 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరింది. జూరాల నుంచి 2 లక్షల 70 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా 73 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు శ్రీశైలం జలాశయంలోకి విడుదల చేశారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 57 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేయనున్నారు.