- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
దిశ, వెబ్‌డెస్క్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. దీంతో నేడు సినిమా సంబంధించి అన్ని విషయాలను న్యాయస్థానం కూలంకశంగా పరిశీలించనుంది.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో నిర్మాత అప్పిల్ చేశారు. సినిమా విడుదల నిలిచిపోవడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లితోందని నిర్మాత తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదలను విన్న కోర్టలు ఈ నెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11కు బదులు 8న విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని వ్యూహం నిర్మాత కోరారు. మెరిట్స్ ఆధారంగా ఈ నెల 8న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్‌కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.