‘స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటు’..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 07:42:32.0  )
‘స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటు’..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లొ టీచర్లు లేక స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ క్రమంలో ఆయన దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల తరగతి గదులో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ మూతపడేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యా వలంటీర్లను నియమించి స్కూళ్లు మూత పడకుండా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed