రావి ఆకు పైన విజయదశమి దసరా శుభాకాంక్షలు..

by Kalyani |   ( Updated:2024-10-11 15:24:48.0  )
రావి ఆకు పైన విజయదశమి దసరా శుభాకాంక్షలు..
X

దిశ, నారాయణఖేడ్: లోక కంఠుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు చెడుపై మంచి ,దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి. చెడు ఎంత దుర్మార్గమైనదైన ,ఎంత శక్తిమంతమైన విజయం మంచినే వర్తిస్తుంది. మాతా ఆశీస్సులు అందరిపై ఉండాలని, శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయ దశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారాయణఖేడ్ కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ అశ్వత్ధ పత్రాలపై వేసిన మహిషాసుర మర్దిని, దుర్గామాత , రావణ సంహారం చిత్రాలతో విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story