రియల్ హీరో పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేష్

by Mahesh |   ( Updated:2024-09-05 13:10:08.0  )
రియల్ హీరో పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 2 అయిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌లో.. " రియల్ హీరో పవన్ కల్యాణ్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యారు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే పవన్ అన్న.." అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed