యువతిపై ప్రేమోన్మాది దాడి

by M.Rajitha |
యువతిపై ప్రేమోన్మాది దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో నర్సుగా పనిచేస్తూ, అదే కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్ళి తిరిగి వస్తుండగా, క్రోసూరుకు చెందిన క్రాంతిమౌళి తన ప్రేమను అంగీకరించాలని, పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆ యువతి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన క్రాంతి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో గొంతు కోసాడు. భయంతో ఆ యువకుణ్ణి పక్కకు నెట్టే క్రమంలో చేతులపైనా తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుణ్ణి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించగా.. యువతిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed