- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Weather: ఏపీపై నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. పలుచోట్ల వర్షాలు!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలుచోట్ల చిరుజల్లులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, శ్రీహరి కోట సమీపంలో విస్తరించినట్లు పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుతు పవనాలు విస్తరణకు అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా శనివారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. శనివారం మధ్యాహ్నంతో పాటు రాత్రి సమయంలో వర్షం దంచి కొట్టింది. బాపట్ల, గుంటూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. గంట పాటు వర్షం కురిసింది. అనంతరం ఆగిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.