వీఆర్‌ఏలకు 'ఫేస్‌ అటెండెన్స్' మినహాయించండి..!

by srinivas |
వీఆర్‌ఏలకు ఫేస్‌ అటెండెన్స్ మినహాయించండి..!
X
  • -ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ రెవెన్యూ సహాయకులకు'ఫేస్‌ యాప్‌ అటెండెన్స్‌'నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు ఉండాలనే నూతన పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు కూడా వర్తింప చేయాలని జిల్లా అధికారులు ఆదేశిస్తుండడం వల్ల రాష్ట్రంలోని వీఆర్ఏ‌లు అందరూ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు.

అయితే గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు పార్ట్‌ టైమ్‌ వృత్తిగా పని చేసే ఉద్యోగులు. వీరికి ఇచ్చే జీతభత్యాలు గౌరవ వేతనం మాత్రమే. అంతే కాకుండా వీరికి వచ్చే అతి తక్కువ జీతంతో స్మార్ట్‌ ఫోన్‌ కాదు కదా..అసలు ఏఫోన్ కూడా కొనుకోలేని ఆర్థిక పరిస్థితి ఈ ఉద్యోగులది. దశాబ్దాల క్రితం నుంచి పని చేసే వీరిలో ఎక్కువ మంది చదువురానివారు, అసలు సెల్ ఫోన్ వాడకం తెలియని వారు కూడా ఉన్నారు. దీంతో వీరు ముఖ ఆధారిత హాజరు పద్ధతి నుండి మినహా ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ మేరకు మంగళగిరిలో ఏపీ రెవిన్యూ అసోషియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సంఘాల పక్షాన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్‌ని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిశారు. సమస్యను లేఖ రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed