- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Gunturలో తొక్కిసలాట ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ, పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే గుంటూరులో తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ఆరోపించారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని చెప్పుకొచ్చారు. తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తవకముందే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సరిపడా భద్రత ఇవ్వకుండా.. ఇచ్చామంటూ ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని విమర్శించారు. భారీ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ప్రభుత్వం భద్రత ఎందుకు కల్పించడంలేదు?, సభకు హాజరైన కొద్దిపాటి పోలీసులు కూడా విధుల నిర్వహించని విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. తొక్కిసలాట జరగకుండా చూడండని చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఘటన జరిగిన క్షణాల్లో రాబందుల్లా వాలి శవరాజకీయాలు చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలు భద్రతపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారనే సమాచారం ముందస్తుగా ఉన్నప్పటికీ భద్రత కల్పించకపోవటం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం కాదా? అని నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు.
30 వేల మందికి పైగా హాజరైన సభను 30 మంది పోలీసులు ఏవిధంగా నియంత్రిస్తారు?, ప్రభుత్వ భద్రతా వైఫల్య ఘటనలు పదే పదే జరుగుతున్నా పట్టించుకోకపోవటం దేనికి నిదర్శనం?, ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం బధ్రత కల్పించదా? అని నసీర్ అహ్మద్ ప్రశ్నించారు. ప్రజలకు భద్రత, రక్షణా చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం శవరాజకీయాలు చేయడానికి మాత్రం ముందుందని, గాయపడినవారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
Also Read...