- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ వక్ఫ్ బోర్డు నియామక జీవో వెనక్కి... వివరణ ఇచ్చిన ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former CM Jagan) హయాంలో ఏపీ వక్ఫ్ బోర్డు(AP Waqf Board) సభ్యులను నియమించింది. ఈ మేరకు జీవో 47ను తీసుకొచ్చింది. అయితే బోర్డు సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం(Coalition Government) గుర్తించింది. వక్ఫ్ బోర్డులో మాజీ ఎంపీలకు అవకాశం కల్పించకపోవడం, పాదర్శకత లేకుండా జూ లాయర్లను నియమించడంతోపాటు సభ్యుల అర్హతపై ప్రశ్నలు తలెత్తిన నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ జారీ చేసిన 47 జీవోను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చింది. మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు పని చేయకపోవడంతో పరిపాలన స్తబ్ధతకు గురైందని, అందువల్ల తప్పనిసరిగా జీవో 47 ఉపసంహరణ చేయాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో వివాదాలు తలెత్తాయని, ఈ కారణంతో చైర్మన్ నియామకం సమస్యగా మారిందని వెల్లడించింది. లోపాలను సరిదిద్ది త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.