Amaravatiలో బీజేపీ కార్యకర్తలపై దాడి.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..

by srinivas |   ( Updated:2023-03-31 11:42:47.0  )
Amaravatiలో బీజేపీ కార్యకర్తలపై దాడి.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి మందడం శిబిరం వద్ద బీజేపీ నేత సత్యకుమార్ రాజు కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేశారు. అమరావతి రాజధాని రైతులకు మద్దతు తెలిపి వెళ్తున్న సత్యకుమార్ రాజు కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడి చేయించింది వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అని బీజేపీ నేత రమేశ్ నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దాడులు చేయించడం తమ సంస్కృతి కాదని పేర్కొన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్నది ఉద్యమం కాదని సజ్జల వ్యాఖ్యానించారు.

వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతికి చంద్రబాబు ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడంలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఆయన హయాం అభివృద్ధి చేస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా..? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో అభివృద్ధి చేయలేమని వాళ్లే ఒప్పుకున్నారని తెలిపారు. 20 ఏళ్ల పాటు రాజధాని పేరుతో భూములు కబ్జా చేయాలని చంద్రబాబు ఆలోచించారని సజ్జల పేర్కొన్నారు. ‘వికేంద్రీకరణ వల్ల ఎవరికీ నష్టం లేదు. విజయవాడ, గుంటూరు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడి వాళ్లు కూడా హ్యాపీగా ఉన్నారు.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి: Chandrababu: పక్కా ప్రణాళికతోనే దాడి

Advertisement

Next Story