ముందే ప్లాన్ చేసి చంద్రబాబుపై కేసు పెట్టారు: Nandamuri Balakrishna

by srinivas |   ( Updated:2023-09-12 06:42:50.0  )
ముందే ప్లాన్ చేసి చంద్రబాబుపై కేసు పెట్టారు: Nandamuri Balakrishna
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. కేసులు సృష్టించి ఆయనను జైలుకు పంపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అని ప్రపంచం చెప్పుకుంటుందని తెలిపారు. సీఎం జగన్ కక్ష పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. అవినీతి జరిగిందని లేనిపోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదనే ఆక్రోశంతోనే చంద్రబాబుపై కేసు పెట్టారన్నారు. దురుద్దేశంతోనే స్కామ్ సృష్టించారని చెప్పారు. ముందే ప్లాన్ చేసి కేసు నమోదు చేశారని మండిపడ్డారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇప్పటివరకూ చార్జిషీట్ ఎందుకు వేయలేదని, ఆనాడు హైకోర్టు ముట్టికాయలు వేసిందని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ మొదట గుజరాత్‌లో అమలు జరిగిందని బాలయ్య చెప్పారు. గుజరాత్ లో చూసే ఏపీలో అమలు చేయాలనుకున్నారు. ఈ స్కామ్‌లో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎందుకులేదన్నారు. 72 వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ముందు ముందు ఇంకా చాలా కేసులు పెడతారని, అన్నింటినీ ఎదుర్కొంటామని తెలిపారు. జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు చెప్పాలో డిమాండ్ చేశారు. ప్రపంచపటంలో ఏపీని లేకుండా చేశారని మండిపడ్డారు. మాట ఇస్తే తప్పే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు అధైర్యం చెందొద్దని.. తాను కూడా ఇక నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు.

Read More: నేనొస్తున్నా : త్వరలో నందమూరి బాలకృష్ణ ఓదార్పుయాత్ర?

Advertisement

Next Story