Mangalagiri: వాళ్లకు రూ. కోటి ఖర్చు చేస్తున్నా... పార్టీ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-05-12 14:50:44.0  )
Mangalagiri: వాళ్లకు రూ. కోటి ఖర్చు చేస్తున్నా... పార్టీ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్: పార్టీ నిర్మాణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణం అనేది అంత సులువైనది కాదని, చాలా కష్టమైనదని ఆయన తెలిపారు. 10 ఏళ్ల క్రితం 150 మందితో తాను జనసేన పార్టీని స్థాపించానని తెలిపారు. మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇప్పటికీ 140 నియోజకవర్గాల్లోని మండలాలకు అధ్యక్షులు లేరని, మిగిలిన 35 నియోజకవర్గాల్లోని మండలాలకు త్వరలో నియమిస్తామని చెప్పారు. సమస్యలపై నిజంగా పోరాటం చేసే వారే రాజకీయాల్లోకి రావాలని కలగన్నానని పేర్కొన్నారు. తాను నాయకత్వం వహిస్తున్నా పార్టీలో కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. డబ్బులు లేకుండా రాజకీయ చేయడం ఎలానో నిరూపించామన్నారు. పార్టీ ప్రారంభంలో ఓట్లు లేకుండా రాజకీయం చేయాలని చెప్పానని గుర్తు చేశారు. జనసైనికుల ఎల్ఐసీ పాలసీ కోసం రూ.1 కోటి ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఆ నెలలోనే: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story