- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ రాజధానిపై Nadendla Manohar సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడం లేదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలకే నమ్మకం లేదని ఆయన తెలిపారు. రాజధాని అంశంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్దామని అని సవాల్ విసిరారు. విశాఖలో రాజధాని పెట్టి..కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమ జీవితాలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించడం లేదని చెప్పారు.
ఇంత దౌర్భాగ్యపు పాలన ఎన్నడూ చూడలేదు..
తెనాలి పర్యటనలో భాగంగా రామలింగేశ్వరరావుపేట, మారీచుపేటల్లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలకు స్వయంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందజేసి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఇంత దౌర్భాగ్యపు పాలన ఎన్నడూ చూడలేదన్నారు. పింఛన్లు అడిగితే దాడులు చేసి పోలీస్ కౌన్సెలింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గళం విప్పితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రజక సంఘాల నాయకులు నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. రజకుల సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.