- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ కోసం ఇళ్లు కూల్చేస్తారా?.. Janasena తీవ్ర ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేస్తూ వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మచిలీపట్నంలో ఈనెల 14న జరిగే ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన రైతుల్ని భయపెట్టేందుకే ప్రభుత్వం మరోసారి ఇప్పటంలో కుట్రపూరితంగా ఆక్రమణల పేరుతో కూల్చివేతలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. వారాంతాల్లో కూల్చివేతలు ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. భీమవరంలో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 నేపథ్యంలో రెండు రోజుల పాటు రాజకీయ విమర్శలు చేయబోమని పవన్ కల్యాణ్ ప్రకటించడాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటం గ్రామం మీద పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ నిజంగానే సైకో సీఎం అని వ్యాఖ్యానించారు. ఈనెల 14న మచిలీపట్నంలో జరిగే 10వ ఆవిర్భావ సభ విజయం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
మాకు కాదు మీకు దమ్ముందా
మాట్లాడితే ముఖ్యమంత్రి దమ్ముందా.. దమ్ముందా అని ప్రశ్నిస్తారు. దమ్ముంటే ఈ కూల్చివేతలు సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఎందుకు మొదలు పెట్టలేదని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శని, ఆదివారాల్లో ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి మూర్ఖ నిర్ణయం ఆ గ్రామస్థుల్ని వేధించేందుకు కాదా? అని ప్రశ్నించారు. ‘కనీసం పరిపాలనా దక్షత లేదు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే 4 వేల జనాభా ఉన్న చిన్న రైత్వారీ గ్రామంలో ఇప్పటికే 80 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని 120 అడుగులకు విస్తరిస్తామంటారా?.’ అంటూ ధ్వజమెత్తారు. ‘యుద్ధం మీరు మొదలుపెట్టారు. రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వమే. వైసీపీ శాసనసభ్యులు మీరు చేసిన అన్యాయమైన కార్యక్రమాలు, ఎలాంటి అక్రమాలు చేశారో గుర్తుపెట్టుకోండి. శాసనసభ్యుడి ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు ఉందా?. 140 అడుగుల రోడ్డు ఉందా?. మీరు ఇప్పటం మీద దేనికోసం కక్ష కట్టారు. మీ ముఖ్యమంత్రి కళ్లలో ఆనందం నింపేందుకా?. పరిపాలనా దక్షత లేక ఇలాంటి అనవసరమైన కార్యక్రమాలకు సమయం వృథా చేస్తున్నారు.’ అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విరుచుకుపడ్డారు.