- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mla Sankara rao: నేను రెడీ.. రండి..!
దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్షాలకు పెద్దకూరుపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. వచ్చే ఆదివారం 10 గంటలకు అమరావతిలోనే ఉంటానన్నారు. ఇసుక అంశమే కాదని, దేనిపైనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎప్పుడు వచ్చినా చర్చించేందుకు తాను రెడీ అని సూచించారు. తానెక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతి ఆరోపణలపై వెంకటేశ్వరస్వామి టెంపుల్‌లో ప్రమాణం చేస్తానని నంబూరి శంకరరావు పేర్కొన్నారు.
కాగా అమరావతి ఇసుక రీచ్ గుంతలో పెదకూరపాడు మండలం తాళ్లూరు యువకులు ఇద్దరు మృతి చెందారు. అయితే యువకుల మృతిపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఇసుక రీచ్ గుంతలో పెదకూరపాడు మండలం తాళ్లూరు యువకులు ఇద్దరు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానన్నారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వలన నదీ పరివాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యే శంకరరావు ఆధ్వర్యంలోనే ఇసుక రీచ్‌లు నడుస్తాయని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నంబూరి శంకరరావు స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.
యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వలన నదీ పరివాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి.అమరావతి ఇసుక రీచ్ గుంతలో పెదకూరపాడు మండలం తాళ్లూరు యువకులు ఇద్దరు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. pic.twitter.com/9uiwY0GmXN— Kanna Lakshmi Narayana (@KLNTDP) March 30, 2023