ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆర్థిక సాయం పెంపు..!

by srinivas |
ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆర్థిక సాయం పెంపు..!
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. పేదల కోసం ఉద్దేశించిన లే అవుట్లను, అక్కడి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు మనోహర్ దృష్టికి వచ్చింది.


ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్ల, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదని చెప్పడంతో మనోహర్ విస్తుపోయారు. లబ్ధిదారులకు వారి స్థలాలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామమని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story