- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: కమ్మ సామాజిక వర్గంపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు ఆ సామాజికవర్గంలో కొందరు ఉగ్రవాదులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిశ్చితార్ధానికి వెళ్తే తనపై చాలా బలంగా దాడి చేశారని మండిపడ్డారు. హైసెక్యూరిటీ ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను బయటపడ్డానని తెలిపారు. ఖమ్మం ఘటనను చిన్న విషయంగా చూడొద్దన్నారు. తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని పోలీసులు గుర్తించారని, ఇప్పటివరకూ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని చెప్పారు. భౌతిక దాడులు చేసిన రాజకీయ పక్షంగాని, సామాజికవర్గం గాని పైకి వచ్చిన దాఖలు లేవన్నారు. బతికి బట్ట కట్టిన సందర్భాలు లేవని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలుగుదేశం పెద్దలు ఆలోచించుకోవాలని సూచించారు. భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం నాయకులు రాజకీయాల్లో చాలా దెబ్బతింటారని శపించారు. నారా భువనేశ్వరిపై తాను తప్పుగా మాట్లాడలేదని మంత్రి అంబటి పేర్కొన్నారు.