వారాహిని అమ్ముకుని షూటింగ్ చేసుకో.. పవన్‌కు అంబటి సూచన

by srinivas |
వారాహిని అమ్ముకుని షూటింగ్ చేసుకో.. పవన్‌కు అంబటి సూచన
X

దిశ, వెబ్ డెస్క్: ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీని ఓడించడానికి ఎన్నికల్లో పొత్తు తప్పదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వారాహిని చంద్రబాబుకు అమ్ముకుని షూటింగ్ చేసుకోమని హితవు పలికారు. నిజమైన జన సైనికులు, కాపు నాయకులు కూడా ప్యాకేజీ స్టార్ అనే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్ని సీట్లో, ఎన్ని కోట్లో డిసైడ్ అయిపోయిందని అంబటి రాంబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు ఉండవనే నానుడికి తాజా ఉదాహరణ పవన్ కల్యాణ్ అని అంబటి విమర్శించారు. రాజకీయాలు చేయటం కోసం పవన్ రాజకీయ పార్టీ పెట్టలేదని, చంద్రబాబును గెలిపించటం కోసమో పెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబు కోసం పని చేశాడని తెలిపారు. చంద్రబాబుకు అధికారం ఇవ్వటం ప్రజలకు అధికారం ఇవ్వటమా? అని ప్రశ్నించారు. జన సైనికులు, కాపు సోదరులు బట్టలు చించుకుని పవన్ సీఎం అవుతాడని అరుస్తా ఉన్నారని అంబటి రాంబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed