రౌడీసేన కాక ఇంకేమిటి?.. జగన్ వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి

by srinivas |   ( Updated:2022-11-23 13:32:02.0  )
రౌడీసేన కాక ఇంకేమిటి?.. జగన్ వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నర్సాపురం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన పార్టీని రౌడీసేనగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తెలుగు బూతుల పార్టీ అయితే.. జనసేన రౌడీసేన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీపై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. జనసేన రౌడీసేన కాక ఇంకేంటి అని నిలదీశారు. ఈ సందర్భంగా ప్యాకేజీ అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాన్ చెప్పు చూపిస్తూ బూతులు తిట్టిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లో డ్ చేశారు. రౌడీ సేన కాక ఇంకేంటి అంటూ ప్రశ్నించారు.

Advertisement

Next Story