- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ambati Rambabu: సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కంత్రీ.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటిరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి అంటే అమ్మవారని.. అలాంటి పేరు పెట్టుకున్న వాహనం ఎక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. పవన్ ఎక్కిన తర్వాత వారాహి కాస్త.. వరాహి అయ్యిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వరకూ చలో ఏపీ అని, ఎన్నికల తర్వాత చలో హైదరాబాద్ అని పవన్ అంటాడని అంబటి విమర్శించారు.
సినిమాల్లో హీరో అని రాజకీయాల్లో కంత్రీ నాయకుడు అయ్యాడని పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారిపోయారని మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలప్పుడే పవన్‌కు ఏపీ గుర్తుకువస్తుందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి అని, రెచ్చిగొట్టి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు.