Minister Ambati: ద్వారంపూడిని కొడతానంటావా.. పవన్ అంత మగాడివా..?

by srinivas |   ( Updated:2023-06-19 12:18:58.0  )
Minister Ambati: ద్వారంపూడిని కొడతానంటావా.. పవన్ అంత మగాడివా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పవన్ కల్యాణ్ వర్సెస్ ద్వారంపూడిగా ఉన్న రాజకీయం ఇప్పుడు జనసేన, వర్సెస్‌ మంత్రులుగా మారింది. కాకినాడ వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ద్వారంపూడిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి సైతం కౌంటర్ ఇచ్చారు. ద్వారంపూడిని కొడతాడంటా...పవన్ అంత మగాడివా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాజకీయ చేస్తున్నాడా... రౌడీయిజం చేస్తున్నాడా అని మండిపడ్డారు. పవన్ చెప్పులు పోగొట్టుకున్నట్లే బట్టలు కూడా పోగొట్టుకుంటారని మంత్రి అంబటి హెచ్చరించారు. దమ్ముంటే ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని పవన్ చెప్పగలడా? అని నిలదీశారు.

పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని ఉంటే ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. కానీ ప్రాణహాని ఉందని దిగజారుడు రాజకీయాలు చేయొద్దని సూచించారు. పవన్ మాటల వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని అంబటి ఆరోపించారు. 2009లో తాను రాజకీయాల్లో ఉంటే జగన్ ను సీఎంను కానిచ్చేవాడిని కాదన్న వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. 2009లో ప్రజారాజ్యంలో పవన్ లేడా అని ప్రశ్నించారు. వారాహి అంటే అమ్మవారని.. అలాంటి అమ్మవారి పేరున్న వాహనం ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందుకే పవన్ కు సినిమాలే లేవని.. అన్ని ఫ్లాప్ అవుతున్నాయని సెటైర్లు వేశారు.

ఇక చంద్రబాబుపై కూడా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు కరకట్ట ప్రకాశ్ రాజ్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లాక్కుని ముద్దాడిని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైసీపీ ఎవరి నుంచి లాక్కున్న పార్టీ కాదన్నారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు సైతం అంబటి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే కౌరవ వధ జరిగింది కాదా..? అని సెటైర్లు వేశారు. శ్రీవాణి ట్రస్టు గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని.. అసలు శ్రీవాణి ట్రస్టులో అవనీతి జరిగే ప్రసక్తే లేదని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Also Read...

పవన్ కల్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నాపై పోటీ చేయ్: ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed