టీడీపీలో చేరుతున్నా... ఎంపీగా పోటీ చేస్తున్నా: లావు శ్రీ కృష్ణ దేవరాయులు

by srinivas |   ( Updated:2024-02-29 14:26:03.0  )
టీడీపీలో చేరుతున్నా... ఎంపీగా పోటీ చేస్తున్నా: లావు శ్రీ కృష్ణ దేవరాయులు
X

దిశ ప్రతినిధి. గుంటూరు: మార్చి 2న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి వేదికగా జరగబోయే 'రా కదలి రా ' సభలో తాను టీడీపీలో చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయులు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని, మరలా ఆశీర్వదించాలని పల్నాడు ప్రజనీకాన్నిశ్రీ కృష్ణ దేవరాయులు కోరారు.

Read More..

ప్రశాంత్ కిషోర్ సర్వే.. ఆ పార్టీకి మరోసారి భారీ షాక్

Advertisement

Next Story

Most Viewed