భూ బకాసురులు.. గగ్గోలు పెడుతోన్న బాధితులు

by Y.Nagarani |
భూ బకాసురులు.. గగ్గోలు పెడుతోన్న బాధితులు
X

దిశ, ప్రతినిధి నరసరావుపేట: మాచర్ల భూ ఆక్రమణలు, అక్రమాలపై సిట్ ఏర్పాటు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ పాలనలలో విలువైన స్థలాలు, గృహాలు అడ్డగోలుగా స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మా రెడ్డి గురువారం జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో వెల్లడించారు. ఓ వైసీపీ బడా నాయకుడు ఆధీనంలో 250 ఎకరాలు ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరిగాయని, ప్రభుత్వ భూములకు పట్టాలు పుట్టించుకొని రికార్దులు ట్యాపరింగ్‌కు పాల్పడి బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేయాలని జూలై 18న ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్లలో గత ఐదేళ్లలో జరిగిన భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. సిట్ ఏర్పాటు వార్త బాధితులకు ఊరటనిచ్చినా, విచారణ బృందం ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు.

కేసీపీ క్వారీ ఎదురు 50 సెంట్ల ఆక్రమణ

మాచర్ల పట్టణానికి మంచినీరు అందించే రిజర్వాయర్, ఒకప్పుడు కేసీపీ సిమెంటు క్వారీ. దీనిని ఆ సంస్థ మున్సిపాలిటీకి అప్పగించింది. దీని ఎదురుగా ఉన్న 50 సెంట్లపై గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని పథక రచన చేసారు. అయితే, ప్రభుత్వం మారడంతో ఆ తతంతంగా ప్రస్తుతం నిలిచిపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అలాగే, సిట్ బృందాన్ని త్వరగా ఏర్పాటు చేసి భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed