ప్రజాగళం సభ.. చరిత్ర సృష్టించే సభ: నాదెండ్ల మనోహర్

by srinivas |   ( Updated:2024-03-15 16:15:47.0  )
ప్రజాగళం సభ.. చరిత్ర సృష్టించే సభ: నాదెండ్ల మనోహర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాగళం సభ.. చరిత్ర సృష్టించే సభ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ప్రజాగళం సభ అని వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story