- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశాంత్ కిషోర్ సర్వే.. ఆ పార్టీకి మరోసారి భారీ షాక్
దిశ, వెబ్ డెస్క్: ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీకి ఈ సారి 40 సీట్లు వస్తాయని, ఈ మేరకు సీఎం జగన్‌కు ప్రశాంత్ కిషోర్ నివేదిక అందిందని మహేశ్ ఎద్దేవా చేశారు. జనసేన, టీడీపీ పొత్తుతో 25 ఎంపీ, 150 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. సీఎం జగన్ రద్దు చేసిన పథకాలన్నీ తాను చెబుతానని.. కాదని వైసీపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు.
జగన్ పథకాల వల్ల ఒక్కరైనా ధనికుడైనట్లు దమ్ముంటే చూపించాలని మంత్రులకు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలకు సవాల్ విసిరారు. ఇకపై పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ విష ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని.. తొక్కేస్తామని హెచ్చరించారు. త్వరలో విడుదల కాబోతున్న టీడీపీ, జనసేన మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని పోతిన మహేశ్ ధీమా వ్యక్తం చేశారు.