Janasena: సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-09-16 14:02:58.0  )
Janasena: సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కొంతమంది నేతలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందని చెప్పారు. సనాతన ధర్మం కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు మారుతోందన్నారు. అందరినీ కలుపుకుపోవడంతో దేశంలో ఏకత్వం నిలబడిందని గుర్తు చేశారు. ద్వేషం, దోపిడీ ఎప్పుడూ ఉండదని పేర్కొన్నారు. మార్పు అంగీకరించి, ధర్మాన్ని పాటించిన వ్యక్తులే దేశాన్ని నడిపించగలుతారని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజ్యంగం ఇచ్చిన బలం వల్లే సమస్యల మధ్య తాను జనసేనను నడపగలుగుతున్నానన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. నేను ఎప్పటికీ భారతీయుడిగానే మాట్లాడతా. 389 మంది మేథోమథనం వల్లే రాజ్యాంగం వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed