Ap News: రైతులకు గుడ్ న్యూస్... సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-10-18 12:11:41.0  )
Ap News: రైతులకు గుడ్ న్యూస్... సీఎం చంద్రబాబు  కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్యనేతలతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రతన్ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక వ్యవస్థాపకులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తామని, అందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు అదనంగా ఇస్తామని కంపెనీలకు చెప్పామని చంద్రబాబు పేర్కొన్నారు.. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకాలు మరింత ఇస్తామని ప్రకటించమని తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలెప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఎనర్జీ....ఇలా 6 పాలసీలు తీసుకొచ్చామన్నారు. సూపర్ 6 హామీలులాగే సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు. ఇవి అమలైతే ఏపీ నెంబర్ వన్‌గా అవుతుందని చంద్రబాబు తెలిపారు.

గత ఐదేళ్లు.. చరిత్రలో చూడని విధంగా కక్షపూరిత పాలన చేశారని చంద్రబాబు తెలపారు. . ప్రతిపక్ష కార్యకర్తల ఆస్తులు, ఆదాయం, వనరులను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిలబడేందుకు పని చేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలని, అలా చేస్తేనే మనకు అండగా ఉంటారని, ఎవరికీ ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం చూపించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

‘‘అధికారం పోవడంతో జె టాక్స్ ఆగిపోయింది. జే బ్రాండ్స్ అమ్మకాలు లేవు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్‌పై సైకో జగన్‌ దోపిడీకి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో పిచ్చ బాగా ముదిరిపోయిన సైకో జగన్ తాను తెచ్చిన జె బ్రాండ్ల పేర్లు చదివి శునకానందం పొందుతున్నారు.’’ అని వైసీపీ అధినేత జగన్‌పై చంద్రబాబు సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed