- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంటూరులో బంగారం గ్రాము రూ. 100, రూ. 10కే కేజీ కందిపప్పు.. !
దిశ, గుంటూరు టౌన్: ‘గ్రాము బంగారం 100 రూపాయలు. రూ. 10కే కేజీ కంది పప్పు. ఎక్కడో కాదు గుంటూరులోనే. అయితే అందరికి కాదు. ఆ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే. అది కూడా మూడు వందల సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడే నిత్యవసర వస్తువులు నెలకు మూడు సార్లు తీసుకోవచ్చు. వెయ్యి రూపాయల సభ్యత్వం ఉంటే ఎన్నిసార్లైనా నిత్యవసర వస్తువులు పట్టుకెళ్లవచ్చు.’ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఒకరిదిద్దరికి ఇచ్చారు కూడా. ఆ తర్వాత ఏకంగా గ్రాము బంగారం వంద రూపాయలకే ఇస్తామంటూ మరో ప్రచారం చేశారు. ఇక్కడ కూడా ఒక్కరిద్దరికి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని తండోపతండాలుగా జనం రావడంతో రేటు మార్చేశారు. నాలుగు గ్రాములు పదిహేను వేలు, పది గ్రాముల బంగారం 24,000 అంటూ చెప్పారు. దీంతో చాలా మంది డబ్బులు కట్టారు. వేలకి వేలు కట్టి సభ్యత్వం కూడా తీసుకున్నారు. తీరా బంగారం ఇవ్వమని అడిగితే విదేశాల నుంచి వస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారని రాజకీయ నేత చేత రికమండేషన్ చేయించుకొని బంగారాన్ని విడిపించడానికి వెళ్లారంటూ ప్రచారం చేశారు. అయితే ఇదంతా ట్రాష్ అని తెలుసుకొన్న బాధితులు గుంటూరు ఎస్పీకి స్పందన ద్వారా ఫిర్యాదు చేశారు.